సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియాకు బౌలర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ పేసర్లు బుమ్రా (3/46), ఇషాంత్ (2/26), షమి (2/51) చెలరేగడంతో ఇంగ్లండ్ టాపార్డర్ విలవిల్లాడింది. దీంతో గురువారం మొదలైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. తరువాత మొదటి ఇన్నింగ్ లో బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ ఒక వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.