YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ తో పొత్తుపై మండిపడుతున్న నేతలు

 కాంగ్రెస్ తో పొత్తుపై మండిపడుతున్న నేతలు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను విడదీసిన కాంగ్రెస్ పార్టీపై నవ్యాంధ్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విషయం విదితమే. తాజాగా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కొద్దిగానైనా పుంజుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తుపెట్టుకుని వైసీపీని ఎదుర్కోవాలని భావిస్తోంది. అయితే ఈ క్రమంలోనే టీడీపీ – కాంగ్రెస్ ల పొత్తువ్యవహారం ఇరు పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఇటువంటి పొత్తు ఎక్కడికి దారితీస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కర్నూలులో ఈ ఇరు వర్గాల మధ్య 40 ఏళ్లుగా ఎడతెగని ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకవేళ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అనివార్యమైతే కాగ్రెస్ నేత కోట్లకు టీడీపీ నేత కేఈ మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమ తమ పార్టీ వ్యవహారాల్లో తిరుగులేని నేతలుగా పేరొందిన వీరిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా డోన్ లో ఈ ఇద్దరికీ అనుచర గణం ఎక్కువగా ఉందిని తెలుస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే డోన్ తో పాటు కర్నూలు ఎంపీ సీటు తమకే కావాలని కోట్ల వర్గం పట్టుబట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే డోన్ – కర్నూలులో కోట్లకు కేఈ వర్గం మద్దతు తెలపాల్సివస్తుంది. వీరిద్దరికి మధ్య ఉన్న వైరం కారణంగా ఇది ఎంతమాత్రం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. మరి ఈ క్రమంలో ఆ పొత్తుల వ్యవహారం వర్కవుట్ అవుతుందా కాదా అన్న సంగతి పక్కన పెడితే, పొత్తు పేరెత్తి తేనే కేఈ – కోట్ల వర్గాల మధ్య ఆందోళన చెలరేగుతోందని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు వద్దే వద్దని కేఈ కృష్ణమూర్తి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దనేది తన అభిప్రాయం మాత్రమే కాదని, క్యాడర్ అభిప్రాయం అంటూ ఆయన వాదిస్తున్నారు. ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించి తన కుమారుడు శ్యాంబాబుకి టిక్కెట్ కూడా చంద్రబాబు వద్ద ఖరారు చేయించుకున్ననేపధ్యంలోనే కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ తో పొత్తువద్దంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Related Posts