తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో మృతి చెందారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయ 2003లో 'చంటిగాడు' సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. అంతకుముందు సినీ జర్నలిస్టుగా పనిచేశారు. అయితే, సినిమాలపై మక్కువతో ఆమె దర్శకత్వ రంగంవైపు అడుగుపెట్టారు. ప్రేమికులు, గుండమ్మగారి మనువడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.